![]() |
![]() |
.webp)
జ్యోతక్క గా పిలుచుకునే శివ జ్యోతి అందరికి సుపరిచితమే. యాంకర్ గా కెరీర్ ని ప్రారంభించిన శివ జ్యోతి.. అందులో తీన్మార్ వార్తలు చదువుతూ.. తీన్మార్ సావిత్రిగా అందరికి పరిచయమైంది.
శివజ్యోతి తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామానికి చెందినది. కొన్ని సంవత్సరాల క్రితం ఈమెకు గంగూలీ అనే వ్యక్తితో పెళ్ళి అయింది. ఆ తర్వాత యాంకర్ గా చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో బిగ్ బాస్ లో అవకాశం దక్కింది. బిగ్ బాస్ షో తో మరింత గుర్తింపు తెచ్చుకున్న శివ జ్యోతి.. ఆ తర్వాత ప్రముఖ న్యూస్ ఛానెల్ లో ఇస్మార్ట్ న్యూస్ రీడర్ గా జాయిన్ అయింది. ఆ తర్వాత తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసింది.
ఇటు ఇన్ స్టాగ్రామ్ లోను తన సత్తా చాటుతుంది. బిగ్ బాస్ షోకి వెళ్ళేకంటే ముందు సంప్రదాయంగా చీరకట్టులో కనిపించే శివ జ్యోతి.. ఆ తర్వాత మాడ్రన్ డ్రెస్ లు వేస్తూ లుక్ ని మార్చేసింది. అయితే ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్ చేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది శివ జ్యోతి. మరొకవైపు యూట్యూబ్ లోని తన ఛానెల్ లో .. నెల క్రితం " మా ఆయన లేకుండానే అమెరికాకి పోతున్నా" అనే వ్లాగ్ చేయగా లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత " అమెరికాలో ఈవెంట్స్ ఇట్లా జరుగుతాయా, నయాగరా వాటర్ ఫాల్స్ చూసిన , కాలి నడకతో తిరుపతి దేవుని దర్శనం, మా కొత్త ఇంటింకేంచి భోనం తీసిన.. ఇలా శివ జ్యోతి చేసిన ప్రతీ వ్లాగ్ కి లక్షల్లో వ్యూస్ వచ్చాయి.
అయితే తాజాగా హైదరాబాద్ లో భోనాలు జరిగాయి. దాంతో దాదాపు అందరు సెలబ్రిటీలు ఈ భోనాల జాతరలో పాల్గొన్నారు. అయితే అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్నారు. పెద్దమ్మ తల్లికి యాటను కోసి తన మొక్కుని తీర్చుకుంది శివ జ్యోతి. తను ఈ మొక్కు తీర్చుకోవడానికి ఏం చేసింది, ఎలా చేసిందంతా ఈ వ్లాగ్ లో వివరించింది శివజ్యోతి. " ప్రతీ సంవత్సరం లాగే పెద్దమ్మ తల్లికి రెండు మేకలతో మొక్కు తీరుస్తాం. ఒక షెడ్ బుక్ చేసుకున్నాం. నాతో పాటు నవ్య, దీప్తి సునైన కోళ్ళని తీసుకొని వచ్చారు. దీప్తి నాన్ వెజ్ తినదు. కానీ ఇది మా ఆచారం. అమ్మవారికి మొక్కు ఇలానే తీర్చుకుంటామని చెప్పాను. వచ్చే సంవత్సరం వరకి కొడుకు పుడితే మళ్ళీ మొక్కు చెల్లించుకుంటాను " అని శివ జ్యోతి చెప్పుకొచ్చింది.
![]() |
![]() |